undavalli-caves-guhalu-near-vijayawada-amaravati-andhra-pradesh-india-famous-popular-tourism-picnic-place-splot

ఉండవల్లి గుహలకి విపరీతమైన రద్ధీ!

Most popular and famous tourism spot “Undavalli Caves” in Andhra Pradesh capital Amaravati near Vijayawada

ఉండవల్లి, ఇది ఎ.పి సీడ్ కేపిటల్ 29 గ్రామాల్లో విజయవాడ నుండి వెళితే మొట్టమొదటిగా వచ్చే గ్రామం. ఇదిప్పుడు గామం కాదులెండి. అమరావతి రాజధానిగా ప్రకటించాకా చిన్న సైజు టౌను లా మారిపోయింది. ఒకప్పుడు ఉండవల్లి సెంటర్ అంటే కొద్దిగా పేరుండేది, అదిప్పుడు పూర్తిగా రద్దీగా మారిపోయింది. ఎటుచూసినా, ఏ సమయం లో చూసినా జనమే జనం. బహుసా సెక్రటేరియట్ కి అటుగానే వెళ్ళాలి కదా అది ఒక కారణమయి ఉండొచ్చు. రెండోది ఇదివరకు ఆ చుట్టుప్రక్కల వారికే తెలిసిన ఉండవల్లి గుహలు ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొంది రోజూ సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం మొదలు పెట్టిన తరువాత ఉండవల్లి గుండా రాకపోకలు విపరీతాంగా పెరగటం వలన ఇంచుమించుగా 90 శాతం మంది అంతకుముందు అటుగా వెళ్ళిన సంధర్భాలు లేకపోవటం వలన దారి మధ్యలో కనబడే ఉండవల్లి గుహలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. “అరె ఈ గుహలు ఇంత బాగున్నాయి ఇంతక ముందు మనం ఎప్పుడు వినలేదే వీటి గురించి” అని చాలా మంది చర్చించుకోవడం నిత్యం పరిపాటి అయ్యింది. అది అలా ఒకరి ద్వారా ఒకరికి తెలిసి రోజూ ఇక్కడికొచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే ఒక్కోసారి 10 నుండి 20 బస్సులు విధ్యార్ధులతో ఒకేసారి ఇక్కడకు రావడం కూడా ఇటీవల కాలం జరుగుతుంది. ఇది ఒక పిక్నిక్ స్పాట్ లా, టూరిజం స్పాట్ లా మారిపోయింది. క్రిందనున్న వీడియో చూసి నచ్చితే షేర్ చెయ్యండి.


<<తక్షణమే సి.ఆర్.డి.ఎ అప్రూవల్ తో అమరావతిలో కంచికచెర్ల వద్ద ప్లాట్లు కొనాలంటే N CITY ఒక్కటే, వివరాలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి>>

AP CM CONVOY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *