doctor-Manthena-satyanarayana-raju-asramam

Awesome place with sceneries in capital city Amaravathi

AmaravathiVijayawada is now a best tourist destination with lot of attractions for both locals and repeat visitors | Nature cure hospital is most beautiful nowDr-Manthena-satyanarayana-raju-asramam-arogyalayamdoctor-Manthena-satyanarayana-raju-asramam.

ప్రకృతి వైద్యానికి పెట్టింది పేరు కేరళా రాష్ట్రం. ఎలాంటి రోగాలయినా డబ్బు, సమయం ఖర్చుపెట్టగలిగితే పూర్తిగా నయం కావల్సిందే అక్కడ. ఆరోగ్యానికి మించింది లేదుకదా! ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇటీవల కాలం లో డబ్బు సంపాధన యావలో కొట్టుకు పోతున్న అనేకమంది తమ ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా మదుమేహం, రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీరా డబ్బు సంపాదించాక అనుభవించడానికి ఆయుష్షు ఉండడం లేదు. ఇటీవల చూస్తున్నాం. 30 సంవత్సరాలు దాటిన వారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. చాలా మంది 40 సంవత్సరాలు వచ్చేసరికి చనిపోవడం కూడా జరుగుతుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పటళ్ళు అయితే పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటంతటికీ కారణం మారిన దైనందిన జీవితమే. అయితే ఎవరు ఎంత బిజీగా అయినా ఉండొచ్చు ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణా వారికయితే మరీను. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలకు విజయవాడ 5 నుండి 6 గంటల్లో చేరుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం ఉంది. అదేనండి పొద్దున్నే టి.వి లల్లో ఆరోగ్యం, యోగా గురించి వివరిస్తారు కదా మంతెన సత్యనారాయణ రాజు గారు. ఆ మధ్య ఆయన బ్రతికుండగానే చచ్చిపోయారని, ఇంకా అన్ని కబుర్లు చెబుతాడు గాని ఆయన గుండెకు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడంట, ఇంకా ఆయన బార్య ఆయన్ను వదిలేసిందంట కదా అని అని రకరకాలుగా వదంతులు పుట్టించారు. వాస్తవానికి ఆయన నిక్షేపంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు, ఆయన భార్య కూడా ఆయనతోనే ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉంటే మనవద్దకు ఎవరు వస్తారు అని బయపడినవారు చేసిన పనే ఇది. ఆయన స్థాపించిందే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం. ఇది కృష్ణా నది వడ్డున కరకట్ట కానుకుని ఉన్న చాలా పెద్ద ప్రకృతి వైద్యాలయం. ప్రకాసం బేరేజి నుండి చాలా దగ్గర. బేరేజ్ దగ్గరకి వెళ్ళాక ఎవరిని అడిగినా అడ్రస్ చెబుతారు. ఇక్కడ ఉంటేనే చాలు ఆరోగ్యం కుదుటపడుతుంది అనేంత అందంగా, విసాలంగా, ఎటు చూసినా చెట్లతో నిండిపోయుంటుంది. కృష్ణా నదిలోనే ప్రత్యేక ఈత కొలను ఇక్కడ ప్రత్యేకత. మంచి గాలి పీల్చుకోవడానికి కృష్ణా నదిలో బోటింగ్ ఉంటుంది. ఇక్కడ వారు చెప్పిన పద్దతులు ఖచ్చితంగా పాటిస్తే నెల రోజుల్లోనే అనేక రుగ్మతల నుండి స్వస్థత పొందొచ్చు.

అక్కడ ఉన్న పరిస్థితులు క్రింద నున్న వీడియోల్లో చూడొచ్చు. Please watch and SHARE below videos about Dr Manthena Satyanarayana Raju Arogyalayam.

VIDEO 1

VIDEO 2

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *