Mandhadam-panchayat-office-tsr-corporate-team-lands

The best maintenance of a Gram Panchayat office in Telugu states

Mandhadam is one of the 29 villages in AP seed capital, it’s Gram Panchayat office has most beautiful and neatness atmosphere in Andhra PradeshMandhadam-panchayat-office-tsr-corporate-team-lands

ఆంధ్రప్రదేశ్ సీడ్ కేపిటల్ 29 గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదివరకెన్నడూ లేని రద్దీ. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, మిర్చి బజ్జీ బళ్ళు, రియల్ యస్టేట్ ఆఫీస్ లు ఒకటేమిటీ ఏ ఊరు చూసినా కళకళలాడిపోతున్నాయి. అలవాట్లో పొరపాటుగా అమరావతి ఏం డెవలప్ అయ్యింది. 3 సంవత్సరాలనుండి ఏం చేస్తున్నారు అని మాత్రం డైలాగ్ వెయ్యకండి అక్కడున్న వారికి కోపం నషాలానికి ఎక్కిపోతుంది. ఆ ఫలాలను అనుభవిస్తుంది వాళ్ళే కాబట్టి. కొంతమంది కూలీలను అడిగితే నెలనెలా 2000 రూపాయలు వాళ్ళ ఎకౌంట్ లో పడిపోతున్నాయంట. ఎక్కడో నూటికో కోటీకో ఒక్కడో, ఇద్దరో రచ్చ చేస్తే వాడ్నే చూపిస్తారు, చూపించిందే చూపించి వందసార్లు. రోజు వారీగా కొన్ని పేపర్లు తిరగేస్తూ, కొన్ని టి.వి చానల్స్ ను మాత్రమే చూసేవాళ్ళకు వాటిలో వచ్చే వార్తలకు ఇక్కడ జరుగుతున్న వాటికి పొంతనే ఉండదు. ఇక్కడంతా చాలా సంతోషంగా గడుపుతున్నట్లు స్పష్టంగా కనబడుతుంది. ఎవరికి వారు వ్యక్తిగతంగా వెళ్ళి రీసెర్చ్ చేస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు మీకు చెప్పబోయేది నూటికి నూరు శాతం నిజం సోదర సోదరీమణులారా! ఉండవల్లి నుండి వయా మందడం, వెలగపూడు, రాయపూడి, తుళ్ళూరు, పెదపరిమి, తాడికొండ మీదుగా గుంటూరు వెళ్ళేవారికి, చూసేవారికి చెప్పక్కర్లేదు. ఇప్పుడు చెప్పిన ఊర్లు 2 సంవర్సరాల ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడెలా ఉన్నాయో! అప్పుడు పల్లెటూర్లలా ఇప్పుడు పట్టణాలలా ఉన్నాయి. ఇది నిజం. ఈ క్రింద మందడం పంచాయితీ ఆఫీస్ వీడియో చూస్తే మీకు ఇట్టే అర్ధమవుతుంది.

సి.ఎం కాన్వాయ్ చూసారా మందడం సెంటర్ నుండి వెలగపూడి సెక్రటేరియట్ కి ఎలా వెళ్తుందో !!

నవ్యాంధ్రలో అతి వెడల్పైన రోడ్డు నిర్మాణం ఎక్కడ జరుగుతుందో తెలుసా? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి ఒకసారి !!!

Images

AP CM CONVOY AT BENZ CIRCLE – VIJAYAWADA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *