kanaka-durga-temple-vijayawada-bhavani-island-punnami-ghat-boat-riding

Scrap Sculpture of Bezawada Kanakadurgamma in Vijayawada Bhavani Island

Wonderful response from tourists about Scrap Sculptures in Bhavani Island and opposite to police control room in Vijayawada, Kanakadurga Sculpture is best of allkanaka-durga-temple-vijayawada-bhavani-island-punnami-ghat-boat-riding

ఏ ప్రభుత్వానికయినా ఆధాయం సమకూరే ప్రధాన వనరుల్లో పర్యాటకం అతి ముఖ్యమైనది. ఎప్పటికప్పుడు క్రొత్త క్రొత్త ఆలోచనలతో క్రొత్త క్రొత్తగా ఆకర్షించాలి పర్యాటకులను. మరలా మరలా రప్పించగలగాలి. సహజ సిద్దంగా ఏర్పడిన అందమైన ప్రదేశాలకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. కాని కృత్రిమంగా ఏర్పాటు చేసిన పార్కులు లాంటి వాటిలో అయితే కొంత కాలానికి అందులో ఉన్న వాటిని మారుస్తూ సరికొత్తగా చాలా సృజనాత్మకంగానూ కళాత్మకంగానూ తయారు చేస్తుండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలను ఆకర్షిస్తూ ఉండాలి. ఈ విషయం లో విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు అందరికంటే రెండాకులు ఎక్కువే చదివినట్లున్నారు. పనికి రాని పాత ఇనుప సామాన్లతో ఏకంగా రకరకాల బొమ్మలు తయారు చేయించి అన్ని పార్కుల్లో ఏర్పాటు చేసారు. ఈ ప్రయోగం చాలా సత్పలితాల్ని ఇచ్చిందంట. బస్ స్టేషన్ దగ్గరున్న విజయవాడ పోలిస్ కంట్రోల్ రూం దగ్గర పార్కులో మరియూ భవాని ఐలాండ్ లో ఈ రకమైన బొమ్మలు చూడ డానికి ఎంతో మంది పనిగట్టుకు వస్తున్నారు. క్రిందనున్న వీడియోల్లో ఆ బొమ్మలు(శిల్పాలు) చూడొచ్చు.

Watch the below videos of Scrap Sculptures of Kali and some animals and birds.

VIDEO 1

VIDEO 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *