Amaravati-residential-crda-plots-lands

అమరావతిలో ఇప్పుడు భూమిపై పెట్టుబడి సేఫేనా(సురక్షితమేనా)?

కొన్ని పెట్టుబడులు మన ఆస్తిని పెంచుతాయి. కొన్ని పెట్టుబడులు మన ఆస్తిని తుంచుతాయి. మరికొన్ని పెట్టుబడులు మనకున్న ఆస్తిని, అస్థిత్వాన్ని పెంచటమే కాకుండా మన రాజసాన్ని కూడా పెంచుతాయి. Amaravati-residential-crda-plots-lands
ప్రస్తుత నవ్యాంధ్ర రాజదాని అమరావతిని (ధాన్యకటకం) కేంద్రంగా చేసుకుని బహు రాజవంశీకులు సుపరిపాలన గావించియున్నారు. వారిలో చోళులు, పల్లవులు, శాతవాహనులు, కాకతీయులు, ఇక్ష్వాకులు, కొండవీటి చక్రవర్తులు మొదలైనవారున్నారు. వారి పర్యవేక్షణలో ఈ ప్రాంతం బహువిధాల అభివృద్ది చెందింది. వారి పరిపాలన నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో సాగి చరిత్రలో సువర్ణాధ్యాయాలుగా మిగిలిపోయాయి.
అ-మ-రా-వ-తి అనే పదంలోని అక్షరాలు ఉచ్ఛరించినపుడు “ఓ3మ్” అను ప్రణవ నాదంలోని అ-ఉ-మ్ అక్షరాలలోని అ-మ అనే అక్షరాలు కలిగియుండుట వలన ఆ పేరుకు ఒక దివ్యత్వం కలిగి, ఉచ్ఛరించినవారికి ఒక అలౌకిక ఆనందముతో కూడిన ప్రకంపనలు కలుగుట మీరు అనుభూతి చెంది ఉంటారు. అటువంటి దివ్యమైన పేరును మన రాజధాని కలిగియుండుట మన అదృష్టము. అమరావతి అంటే అజరామరమైనది లేదా మృత్యువు రానిది, నిరంతర యవ్వనం కలది అని అర్దం. అందుకేనేమో ఇన్నాళ్ళ తరువాత కూడా తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటుంది.
కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో విదేశీ వ్యాపారం పరిఢవిల్లిందంటే ఇక్కడ ఎంతటి ఆభివృద్ది జరిగిందో ఉహించవచ్చు. కాలక్రమేణ రాజుల కాలం అంతరించగానే ఈ ప్రాంత వైభవం పాశ్చాత్య నాగరికతకు బలైపోయింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ గొప్ప నాగరికతకు గట్టి పునాదులు పడ్డాయి. అందుకు నిదర్శనాలే లండన్ మ్యూజియంలో ఉన్న ఈ ప్రాంత గొప్ప శిల్ప, శాసన సంపద. మరల ఇన్ని సంవత్సరాల తరువాత అంతటి మహద్భాగ్యం మన సొంతం కాబోతుంది. గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు, రాజనీతిజ్ఞులు, శాంతికాముకులు, శాంతి ప్రబోధకులు, విశ్వవ్యాప్త వర్తకులు, వివిధ అంశాలలో ప్రవీణులైన కళాకారులు, విద్వాంసులు మొదలైనవారు నడయాడిన పుణ్యభూమి, కర్మభూమి మన అమరావతి.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం చూసినా, మంగళగిరి మరియు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు ఒక గొప్ప క్షేత్రంగా అభివృద్ది చెందుతుందని ఉంది. ఇన్ని సంవత్సరాలకు ఆ మహానుభావుడు చెప్పిన మాటలు నిజాలు కాబోతున్నాయి.
శక్తి పీఠాలలో ఒకటైన బెజవాడ కనకదుర్గమ్మ ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉంది. ఈ శక్తిపీఠం యొక్క శక్తిని అమరావతిలో పారేలా, చైనా వాస్తు (ఫెంగ్ షూయి) ప్రకారం, అమరావతి నాభి స్థానంలో ఒక బ్రహ్మస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది రాబోయే అమరావతికి శక్తి స్థానంగా మారి తద్వారా అమరావతి నగర సమగ్ర అభివృద్దికి తోడ్పాటునిస్తుంది. ఇలాంటి అపరిమితమైన, అజరామరమైన శక్తి కలిగిన బ్రహ్మస్థానాలు కలిగిన నగరాలు చాలా చాలా అరుదు. అందులో మన అమరావతి నగరం ఉండుట మనకు గొప్ప శుభదాయకం.
ప్రపంచ వ్యాప్తంగా శాంతి సదస్సులు జరుగుతున్న ఒకేఒక నగరం : కొపెన్ హైగన్. ఆ నగరంలో కాలుష్య శాతం యావత్తు ప్రపంచంలోనే చాలా తక్కువ. అక్కడ ప్రతి ఒక్కరు సైకిల్ ఉపయోగిస్తూ నగర కాలుష్య నివారణకు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఆ నగర సైక్లింగ్ ట్రాక్ పొడవు : 416 కిలోమీటర్లు. మన అమరావతి నగరంలో కూడా సైక్లింగ్ ట్రాక్ లు ప్రధాన రవాణా మార్గాలుగా ఉండబోతున్నాయి. మన అమరావతి నగరంలో ఈ సైక్లింగ్ ట్రాక్ పొడవు : 1620 కిలోమీటర్లు. ఇది ప్రపంచ రికార్డు. ఇటువంటి రికార్డులు మన అమరావతికి రాబోయే రోజుల్లో ఎన్నెన్నో వస్తాయనుటలో సందేహమే లేదు. తద్వారా అమరావతి ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా మారి సమీప భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ నగరంగా రూపాంతరం చెందుతుందనుటలో అతిశయోక్తి లేనేలేదు.
ఏదైనా ఒక నగరాన్ని నిర్మించాలంటే గొప్ప దైవానుగ్రహం ఉండాలి. పూర్వం చక్రవర్తులు ఒక ఆలయాన్ని నిర్మించాలంటే ఋషులు, పురోహితులు, సరస్వతిపుత్రులను సంప్రదించి వారు సూచించిన విధంగా ఒక పాజిటివ్ శక్తి కలిగిన స్థలాన్వేషణ కావించి ఆ స్థలంలో మాత్రమే నిర్మాణం కావించేవారు. అలా నిర్మించిన ఆలయాలు ఏన్నో భీకర యుధ్దాల తరువాత కూడా చెక్కుచెదరకుండ ఉండటాన్ని మనం అందరం గమనించే ఉంటాము. ఇప్పుడు మన అమరావతి కూడ అదే పద్దతిలో నిర్మాణం కావించబడుతోంది. దీనికి ఎవరు ఎన్ని అవాంతరాలు, అభ్యంతరాలు సృష్టించినా అమరావతి యొక్క నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆటంక పరచలేరు. ఆటంక పరుచుదామనుకున్నా వారు భంగపడటం తప్ప సాధించేది ఏది ఉండదు.
అమరావతికి ప్రక్కనే ఉన్న కొండవీడులో శ్రీకృష్ణుడు సంచరించాడని, అక్కడి గోవులను ఆదరించాడని ప్రతీతి. అలాగే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఒక గొప్ప యుధ్దం గెలిచిన తరువాత తనా మొక్కిన మొక్కు ప్రకారం ఒక శ్రీకృష్ణ విగ్రహాన్ని తయారు చేయించి ఒక చోట ప్రతిష్ఠించటానికి తీసుకువెళుతుంటే ఆ విగ్రహం కలిగిన రథం మన అమరావతికి దగ్గరగా ఉన్న ఊరి గుండా వెళుతూంటే ఆ రథం కూరుకుపోయి ముందుకు వెళ్ళకుండా ఆగింది. దీనిని తెలుసుకున్న రాయలువారు తమ ఆస్థాన పండితులను పరిష్కారం అడుగగా వారు శ్రీకృష్ణుల వారు ఆ ఊరిలో ఉండుటకు ఇష్టపడుతున్నారేమోనని చెప్పారట. అందువలన రాయలు వారు ఇక్కడే శ్రీకృష్ణ మందిరమొకటి నిర్మించారని శాసనం. ఇప్పుడు అది పురాతన ఆలయం. ఇది తెలిసిన ఇస్కాన్ సంస్థ వారు ఇక్కడ ఒక సరికొత్త శ్రీకృష్ణ స్వర్ణ మందిరాన్ని నిర్మించేందుకు సంకల్పించారు. ఈ స్వర్ణ మందిరమే ఆంధ్రప్రదేశ్ కు తొలి స్వర్ణమందిరం కావడం, అది అమరావతికి కూతవేటు దూరంలో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం శీఘ్ర పురోగతిలో ఉంది.
ఇంగ్లీషులో ఒక సామెత : ఏ యుద్ధంలోనైనా యుద్ధం జరుగక ముందే విజేత ఎవరో నిర్ణయించబడుతారు. అది ఇరు వర్గాల నాయకుల మనసుకు తెలిసే ఉంటుంది. కాని యుద్ధం కేవలం యుద్ధకాంక్ష ఉన్న రాజుల, ప్రజల ఇగో కోసమే జరుగుతుంది. దీని ప్రకారం మన అమరావతి వృత్తాంతాన్ని గమనించినా, జరిగిన లేదా జరుగబోయే అంశాలను అవలోకనం చేసుకున్నా, మన అమరావతి నిర్మాణం జరిగింది అనే భావించాలి. కేవలం 16.9 చ.కి.మీ. వైశాల్యంలో కట్టడాలు నిర్మించడం మాత్రమే మిగిలిపోయిన పని.
అమరావతి వాస్తు :
భారతీయ వాస్తుశాస్త్ర ప్రకారం, అమరావతి భూభాగంలోని సులక్షణమైన వాస్తు సూచికలు:
1. ఉత్తర ఈశాన్యాన జీవ నదైన కృష్ణానది, కొన్ని వందల సంవత్సరాలుగా ప్రవహిస్తోంది.
2. పశ్చిమ నైరుతిలో ఎతైన పచ్చని కొండలు
3. దక్షిణం నుంచి ఉత్తరానికి వచ్చేకొద్దీ పల్లంగా జాలువారుతున్నట్లున్న భూములు
4. ఉత్తరం నుండి దక్షిణానికి 8 సమభాగాలు, తూర్పు నుండి పడమరకు మరో 8 సమభాగాలు. త్రికోణాకృతిలో అమరావతిలో మధ్యలో ఆకాశాన్ని చూస్తున్న బ్రహ్మస్థానం
పైన చెప్పిన వాస్తు సూచికల ఆధారంగా అమరావతి వంద శాతం వాస్తు కలిగి ఉంది. తద్వారా అమరావతి నగర నిర్మాణం శీఘ్ర గతిన అభివృద్ధి చెందుట తథ్యం. ప్రస్తుతం ఎంతో ప్రాభవం కలిగిన తిరుమల దేవస్ధానం సైతం ఇదే విధమైన సులక్షణమైన వాస్తు కలిగియుండుట గమనార్హం.
అమరావతి నేల : రాబోయే అమరావతిలో ఇప్పటిదాకా రైతులు ఏడాదికి మూడు పంటలు పండించారు. వాటిలో ప్రధానంగా ఉన్నవి – పసుపు, అరటి, మామిడి, దుంపలు మొదలైనవి. మన కుటుంబాలలో ఏ శుభకార్యమైనా మనం తప్పకుండా వాడే పదార్థాలేగా ఇవి. అంటే ఈ నేలతల్లి కూడా అమరావతికి అనుకూలంగా ఉంది అనుటలో మరియు సకల శుభాలు కలుగజేస్తుందనుటలో ఏమాత్రం సందేహం లేదు.
అమరావతిలో నవ నగరాలు :
1. పరిపాలన నగరం
2. న్యాయ నగరం
3. ఎలక్ట్రానిక్ నగరం
4. క్రీడా నగరం
5. విజ్ఞాన నగరం
6. ఆర్థిక నగరం
7. ఆరోగ్య నగరం
8. విద్యా నగరం
9. పర్యాటక నగరం
ఈ నవ నగరాలు ఆయా రంగాలలో దిగ్గజాలైన కంపెనీలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టించి అమరావతికి ఆర్థిక ఊతమిచ్చుట వీటి ప్రధానమైన బాధ్యత. ఈ వైవిధ్యభరితమైన నవ నగరాలు పూర్తి స్థాయిలో నిర్మాణమైతే అమరావతి యొక్క ప్రభావాన్ని అంతర్జాతీయ స్థాయిలో అమాంతం పెంచివేయగలవు.
అమరావతి అభివృద్దికి దోహదపడే ఉత్ప్రేరకాలు :
1. నాలెడ్జి బేస్డ్ ఏకానమి
2. నవనగరాల ఆవిష్కరణ
3. కాలుష్యం లేని పరిశ్రమలు
4. కాలుష్యం లేని రవాణా సదుపాయాలు
5. వరల్డ్ క్లాస్ యూనివర్శిటీలు, స్కూల్స్
6. వరల్డ్ క్లాస్ స్టార్ హోటల్స్
7. వరల్డ్ క్లాస్ పరిశోధనా కార్యాలయాలు
8. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రౌనేజి వ్యవస్థ
9. కంప్లీట్ అండర్ గ్రౌండ్ విద్యుత్తు వ్యవస్థ
10. నీటి కొరత రాకుండా భారీ రిజర్వాయర్లు, చెక్ డ్యామ్ లు, కొండవీటి వాగు అభివృద్ధి
11. నీటి పునర్వినియోగానికి అవసరమైన ప్రణాళికలు
12. వైవిధ్యభరితమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
13. నగర నిర్మణానికి అవసరమైన అంతర్జాతీయ స్థాయి సమగ్ర ప్రణాళికలు
14. అంతర్జాతీయ స్థాయి భవన ఆకృతులు
15. అంతర్జాతీయ స్థాయి పర్యాటకం
16. నిరంతర క్వాలిటి విద్యుత్తు
17. అంతర్జాతీయ స్థాయి సెక్యూరిటీ సదుపాయాలు
18. మనస్సును ఉల్లాస పరిచే పార్కులు, వాటర్ థీమ్ గేమ్స్, వాటర్ టూరిజం
19. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాలు
20. అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య కేంద్రాలు
21. వేల ఏళ్ళు మన్నే మహనగర నిర్మాణ రీతులు
22. ప్రకృతి వైపరీత్యాలను సమర్దంగా తట్టుకునే కట్టడాలు
23. భారీ ఆర్థికం సమకూరే సైడ్ ఎఫెక్టు లేని పరిశ్రమలు
24. ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాని అతి భారీ రవాణా మార్గాలు
25. ఎక్కువమంది ఒకేసారి ప్రయాణించగలిగే భారీ రవాణా వసతులు
26. కమ్యూనిటి లివింగ్
27. అత్యున్నత నగరీకరణ పద్ధతులు
28. సామాన్య ప్రజల నుండి ఉన్నత వర్గాల వరకు మురికివాడలు లేని నివాసయోగ్యాలు
29. అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణాలు మరియు వసతులు
30. జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి వివిధ మీడియా సంస్థలు
31. అంతర్జాతీయ స్థాయి ఐకానిక్ టవర్స్
32. అమరావతికి దారితీసే, కృష్ణానది మీద నిర్మించబోయే ఐకానిక్ బ్రిడ్జిలు
33. ప్రతిఒక్క ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం
34. అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్లు
35. అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్‌వేర్ సంస్థలు
36. ఇన్నర్ రింగ్ రోడ్డు
37. ఓటర్ రింగ్ రోడ్డు
38. అంతర్జాతీయస్థాయిలో చెత్త నుండి కాలుష్యం లేని విద్యుత్తు ఉత్పాదన చేసే పరిశ్రమలు
39. అంతర్జాతీయ స్థాయిలో మురుగునీటిని శుద్ధిచేసే ఫ్లాంట్లు
40. వివిధ రకాలుగా కాలుష్యం లేని విద్యుత్తును ఉత్పత్తి చేసే పరిశ్రమలు
41. అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు
42. షాపింగ్ మాల్స్ ఇంకా ఎన్నో, ఎన్నెన్నో రాబోయే ప్రాజెక్టులు.
రాబోయే అతి కొద్ది రోజుల్లో అమరావతిలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. దీంతో అమరావతిలో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూరుతాయి అనుటలో అస్సలు సందేహమే లేదు.
మనం యావత్తు ప్రపంచంలో ఎక్కడైనా, ఎప్పుడైనా భూమిని కొనవచ్చు కానీ ఇంతటి ప్రశస్తమైన చరిత్ర కలిగిన మరియు సత్వర అభివృద్దికి అవకాశమున్న భూమిని కొనుట జరిగేపనేనా? అందుకే ఇప్పుడు ఇంతటి గొప్ప అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇంతటి బ్రహ్మాండమైన చరిత్ర కలిగిన అమరావతిలో భూమిని కలిగిఉండుట ఎంతైనా మన పూర్వ జన్మ సుకృతం. ఇటువంటి భూమి మీద పెట్టుబడి దీర్ఘకాలంలో తప్పనిసరిగా సాలీనా 14 శాతానికి మించి వడ్డీ ఇచ్చి తీరుతుంది అనుటలో సందేహ పడాల్సిన అవసరమే లేదు. మరి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి మరి!
అహో అమరావతి! ఆరుకోట్ల ఆంధ్రుల ఆశల వారధి!

CLICK THE LINK https://goo.gl/kQw2Ws FOR BEST CRDA APPROVED PLOTS IN AMARAVATHI

Watch the below video about widest road(Seed Axis Road) in AP capital Amaravathi

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ కేపిటల్ లోని 29 గ్రామాల్లో ఒకటైన ఉండవల్లి చూడండి రెండే రెండు సంవత్సరాలలో ఎంత డెవలప్ అయిపోయిందో. క్రిందనున్న వీడియో ఒకసారి చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *