pattisema-project-godavari-water-krishna-river-mahasangamam-vijayawada-prakasam-barrage

Prakasam Barrage completely filled with Godavari water

Really wonder – Pattisema Project – Krishna river in Vijayawada was completely filled with Godavari water very useful for Krshna Delata Farmerspattisema-project-godavari-water-krishna-river-mahasangamam-vijayawada-prakasam-barrage

మంచి విషయం జనానికి చేరువవ్వాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అదే చెడ్డ విషయమైతే క్షణాల్లో చేరిపోతుంది. ఫట్టిసీమ ప్రాజెక్ట్(Pattisema Project) లాంటి అద్భుతం మరే రాష్ట్రం లో నైనా జరిగితే అక్కడ పండగే పండగ. ఇది నిజంగా చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్. ఇప్పుడు జరిగే సీజన్ తో కలిపి అప్పుడే రెండు సంవత్సరాలు గోదావరి నీరు(Godavari Water) పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నదిలోకి రావడం కృష్ణా డెల్టాలో పంటలు సజావుగా పండడం, శ్రీశైలం & నాగార్జున సాగర్ ద్వారా ప్రకాసం బేరేజ్ కు రావల్సిన నీరు రాయలసీమకు వదలడం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) పూర్తవడానికి ఇంకో రెండు సంవత్సరాలు పడుతుందనుకుంటే 4 సంవత్సరాలు కృష్ణా డెల్టా మరియు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలమయినట్లే. అంటే పట్టిసీమ ఎంత గొప్ప ప్రాజెక్టో అర్దమవుతుంది. కర్నాటక ప్రభుత్వం ఆలమట్టి ఎత్తు పెంచాక ఆలమట్టి దిగువన వర్షం పడితేనే శ్రీశైలం & నాగార్జున సాగర్ లు కొద్దో గొప్పో నిండుతున్నాయి. ఆ నీరు కనీసం ఒక పంట కూడా పూర్తిగా పండడానికి ఉపయోగపడడం లేదు. అలాంటి సమయం లో పట్టిసీమ నిజంగా ఒక మంచి ప్రాజెక్టే. ముదురు అకుపచ్చ, నీలం కలగలిపిన రంగులో ఉండే కృష్ణా నీరు గోదావరి నీరు రాకతో ఒక్కసారిగా గోదుమ పసుపు కలగలిపిన రంగులోకి మారిపోయినాయి. క్రిందనున్న వీడియో ఒకసారి చూడండి ప్రకాసం బేరేజి మొత్తం గోదావరి నీటితో ఎలా నిండిపోయిందో తెలుస్తుంది.

Watch Below video about Godavari water in Krishna River at Prakasam Barrage

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో తక్కువ రేటులో ప్లాట్లు కొనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి – https://goo.gl/JB8NOh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *