krishna-pushkaralu-2016-vijayawada-ap-andhra-pradesh-telangana

Krishna Pushkara lighting decoration at Vijayawada Varadhi (2-07-2016)

On the occasion of Krishna Pushkaralu Andhra Pradesh government decorated many places in vijayawada, Ferri, Gollapudi, Amaravathi, Srisailam and kurnool. Vijayawada Varadhi is also decorated with colorful lighting, looking gorgeous in night time. Please watch below videos and share to your social networks.

LED lighting between Vijayawada and Ibrahimpatnam

విజయవాడలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో అతిముఖ్యమైనవి ఘాట్ల నిర్మాణం, రోడ్ల వెడల్పు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో వైశాల్యం లో రెండవ అతిపెద్ద నగరం అయినప్పటికి ఇక్కడ ప్రధాన సమస్యలైనటువంటి ఇరుకు రోడ్లు, ఆక్రమణలు ఇంకా తీరిక సమయాల్లో సరదాగా అలా బయటికి వెళ్ళి ఒక గంటో, రెండు గంటలో ఎక్కడన్నా కూర్చుని సేద తీరే అవకాశమే లేదు. ఉన్నవి రెండు ఒకటి రాజీవ్ గాంధీ పార్క్, రెండవది రాఘవయ్య పార్క్. అవి ఇప్పటివి కావు, వాటి నిర్వహణ అంతంత మాత్రమే. ఒకవేళ వాటిలోకి వెళ్ళినా ఎంతో సమయం వెచ్చించలేము. ఇక విజయవాడకు ఆ బెడద కూడా లేదు. ఆక్రమణలన్నీ తొలగించి రోడ్లన్నీ వెడల్పు చేసేసారు. కిలోమీటర్ల లెక్క అత్యంత సుందరంగా ఘాట్లు నిర్మించారు. ఆ ఘాట్ల దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో అందమయిన పార్కులు నిర్మిస్తున్నారు. ఇకనుండి ఇక్కడ కూడా హైధరాబాద్, వైజాగ్ లలో వలె గంటల తరబడి బయట కాలక్షేపం చేసి రావొచ్చు. ఇంకా అశ్చర్యకరమైన విషయమేమిటంటే రోజంతా బస్టాండులో కూర్చుని రావొచ్చంటే నమ్మండి. విజయవాడ వారధి పై కృష్ణా పుష్కరాల నిమిత్తం అలంకరించిన లైటింగ్ ఎంతో అద్భుతంగా ఉంది. పైనున్న వీడియోని వీక్షించి షేర్ చెయ్యండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *