how-learn-easy-way-hip-hop-break-dance-steps-choreography-routines-moves-children-kids-girls

Easy learn dance choreography for beginners

Best way to easy learning SANGEET dance without a dance master

ట్రెండ్” ఎవరయినా ట్రెండును ఫాలో అవ్వాల్సిందే. ఇదివరకు ఏదయినా శుభకార్యం జరిగితే చుట్టాలందరినీ పిలిచి ఇంటిదగ్గరే స్వయంగా వండి వడ్డించే వాళ్ళం. అది అప్పటి ట్రెండ్. ఇప్పుడు కళ్యాణ మండపాలు బుక్ చేసుకుని బయటి వాళ్ళెవరో వండితే అందరం కలిసి అక్కడ తింటున్నాం. ఇదివరకు చక్కగా కూర్చోపెట్టి బోజనాలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళకిచ్చి బఫే అంటున్నాము. ఇష్టమున్నా లేకపోయినా మరుతున్న ట్రెండును బట్టి మారాల్సొస్తుంది. <<GOOD NEWS DOUBLE BED ROOM FLAT ONLY 12.99 LAKHS IN AP CAPITAL AMARAVATHI. MORE DETAILS CLICK HERE>>
అలాగే ఇదివరకు ఏదయినా శుభకార్యానికి కాని, పండగకు కాని మ్యూజికల్ నైట్స్ అని, మ్యూజికల్ పార్టీస్ అని, బోగం మేళం అని రకరకాలుగా వాటిలో నిష్ణాతులైన వారిని పిలిపించుకుని వారు చేసింది చూసి ఆనందించి వారికివ్వాల్సింది ఇచ్చి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం పెద్దగా లేదు ఎందుకంటే సంగీత్ వచ్చింది కదా! ఇక్కడ మనమే ఆడతాం, పాడతాం వచ్చిన అతిదులు చూసి ఆనందిస్తారు. ఈ సంగీత్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే ఇదివరకు బాగా ధనవంతుల పెళ్ళిళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ప్రసార సాదనాలు వల్ల అందరూ క్రమ క్రమంగా సంగీత్ పట్ల ఆశక్తి పెంచుకున్నారు. ఎంతలా అంటే పెళ్ళికి నెలరోజుల ముందు నుండే అవసరమయితే ఒక డాన్స్ మాస్టర్ ని పెట్టూకునైనా ప్రాక్టీస్ చేసి అదరగొట్టేస్తున్నారు. కొంతమందయితే స్పాంటేనియస్ గా స్టెప్పులు ఇరగదీస్తున్నారు. మరికొంతమందయితే డాన్స్ అంటే విపరీతమయిన ఇష్టం అందరిలాగే మనమూ సంగీత్ లో డాన్స్ చెయ్యాలి అనుకుంటారు కాని రాదు, డాన్స్ మాస్టర్ ని పెట్టుకునేంత స్తోమత గానీ, పెద్దల నుండి ప్రోత్సాహం గానీ ఉండకపోవచ్చు. అలాంటి వారికోసం ఎలాంటి డాన్స్ మాస్టర్ లేకుండా ఎవరికి వారే కొద్దిగా ఓపికతో సమయం కేటాయించుకుని ఈ క్రింద ఉన్న వీడియోని ఫాలో అయితే చాలు ఇంక మీరు ఏపాటకి ఏ డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏ స్టెప్ వెయ్యాలనుకుంటున్నరో అంతా చక చకా జరిగిపోతుంది. అయితే ఇది శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే సుమా!
వీడియో నచ్చితే షేర్ చెయ్యడం మాత్రం మర్చిపోవద్దు.

సంగీత్ అనేది ఇప్పుడు మారుమూల పల్లెటూళ్ళలో కూడా చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకూ చాలా చాలా ఆశక్తి చూపిస్తున్నారనడానికి చక్కని ఉదాహరణ ఈ క్రిందనున్న వీడియో చూస్తే మీకే అర్దమవుతుంది. వీడియో నచ్చితే షేర్ చెయ్యడం మాత్రం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *