danger-bike-accident-video-amaravati-vijayawada-guntur-nh5

అజాగ్రత్తగా ఉంటే ఏమయ్యిందో చూడండి!

Danger bike accident in India

క్రిందనున్న వీడియోలో గాని, పైనున్న ఫొటోలో గాని ఉన్న స్కూటీ బైక్ చూడండి. 2016 అక్టోబర్ లో విజయవాడ నుండి గుంటూరు వెళ్ళే జాతీయ రహధారి ప్రక్కన కుంచనపల్లి వద్ద నెల రోజుల బట్టి కనబడుచున్న దృశ్యం. స్కూటీ అంటే జనరల్ గా కాలేజీ అమ్మాయిలే ఎక్కువగా వాడుతుంటారు. లేదా చాలా మంది ఆడవాళ్ళు లేదంటే అతి తక్కువగా మగవాళ్ళు కూడా వాడుతున్నారు. ఏదయినప్పటికీ స్కూటీ అనేది ఎంత డెలికేట్ గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చిన్నగా గుద్దుకున్నా అది నడిపే వారికి పెద్దగా దెబ్బలు తగులుతాయి. అదే ఫొటోలో ఉన్నట్లు గుద్దుకుంటే అది నడిపే మనిషి మీద ఆశలు వదిలేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ముఖ్యంగా జాతీయ రహధారి పై కాలేజి కి వెళ్ళదలచిన అమ్మయిలు గాని అబ్బాయిలు గాని కాలేజ్ అంటే ఒకరోజు తో అయ్యేది కాదు రోజూ ఆ దారి వెంటే వెళ్ళాలి. గంటకి 150 కిలోమీటర్ల వేగంతో కూడా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఒక్క రోజు అజాగ్రత్తగా ఉన్నా కళ్ళు మూసి తెరిచే లోపు ఘోరం జరిగిపోవచ్చు. అందుచేత దీనికి మంచి పరిష్కారం కూడా ఉంది. ఒక్క 10 నిమిషాలు లేటయినా ప్రక్కనే సర్వీస్ రోడ్లు కూడా ఉన్నాయి కదా. వాటిని వాడుకొండి. హైవే ఎక్కి వెళితే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అనిపించొచ్చు కానీ హైవేకి, సర్వీస్ రోడ్డుకి ప్రయాణం సమయంలో 10 నిమిషాలే తేడా ఉంటుంది. అందుచేత ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న విధ్యార్ధి, విధ్యార్ధినులంతా సర్వీస్ రోడ్ల వెంబడి క్షేమంగా కాలేజ్ కి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేయండి. క్రిందనున్న వీడియో ఒకసారి చూసి షేర్ చెయ్యండి.


<<విజయవాడ, అమరావతికి దగ్గరలో కమర్షీయల్, ఫామ్ ల్యాండ్ & రెసిడెంషియల్ ప్లాట్స్ పై ఆశక్తి ఉన్నవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి>>

AP CM CONVOY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *