bamboo-cultivation-plantation-india

Bamboo plantation very profitable crop always

Bamboo cultivation in india. Bamboo plantation is only crop for sustainable and profitable income

This is Bamboo crop located at Taduvai, Near Jangareddygudem, Andhra Pradesh, India. The farmer Mr M Bhushaiah is an unique farmer who introduced first time the crops like Tobacco, Oil Palm and Bamboo plantation in that area. His father Mr. M Nageswara Rao late migrated here from Guntur district 48 years back and he found that the Taduvai lands were most suitable lands for Tobacco crop and he built 12 barns at a time and started Tobacco cultivation. Similarly some more farmers like Gadde Ramachandram, Lakshmanarao, Jetti Gurnadham started the cultivation at their places near to Taduvai. Obviously remaining farmers fallowed the cultivation and got lot of profits earlier stages. After that Tobacco market faced lot of up and downs. Mr Bushaiah s/o Nageswara Rao also faced struggles through Tobacco crop and decided to leave the crop 20 years back and started new plantation Oil palm first time in that area. Earlier days of the plantation other farmers hesitated to cultivate Palm Oil plantation but started after 4 years by observing Bhushaiah’s income on Oil Palm and realized that It is a low budget and high profit plantation. 80 percent of farmers assigned some land for Oil Palm crop. From last 5 years this crop also faces lot of up and downs. Then again Mr Bhushaih removed some acres of Oil Palm plantation and cultivated Bamboo crop just 3 years back. The luck again knocked Bhushaiah’s door. Because unbelievable thing happened that the crop reached cutting stage recently and he got lot of money on Bamboo sticks. With previous experience on Bamboo plantation at the time of his father living, he did not take any trouble now to cultivate the crop. Obviously many many farmers recently coming to Bhushaiah and asking like “How can i cultivate this”, Where can i get these plants” ete…

Please Watch the below video and SHARE

కాలం తో పాటూ పరిగెత్తాలి, ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకణుగుణంగా మనమూ మారాలి లేదంటే వెనకబడిపోతాము. అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా. ఈ సత్యాన్ని అక్షరాలా అచరణలో పెట్టారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన రైతు భూషయ్య గారు. అదికూడా 70 ఏళ్ళు దగ్గర పడుచున్న వయసులో! జంగారెడ్డిగూడెం అంటే ఇప్పుడు మీడియా విస్తృతం అయిన తరువాత అందరికీ బాగా తెలిసిన పట్టణం, మండలం కూడా. పశ్చిమగోదావరి జిల్లాలో బీమవరం తరువాత అంతగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని మెట్ట ప్రాంతం అనికూడా అంటారు. ఆదర్శ రైతు భూషయ్య గారి తండ్రి M నాగేశ్వర రావు గారు 48 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లానుండి ఇక్కడికి వచ్చి భూములు కొనుక్కుని గుంటూరులో అప్పటికే వారికి బాగా తెలిసిన నాటు పుగాకు వ్యవసాయం ఇక్కడ కూడా మొదలుపెట్టడం జరిగింది. తరువాత ప్రబుత్వం పుగాకు బోర్డు ఏర్పాటు చేసిన తరువాత మొట్టమొదటిగా బ్యారన్ పుగాకు వ్యవసాయం మొదలు పెట్టిన మొదటి ముగ్గురు రైతుల్లో నాగేశ్వర రావు గారు ఒకరు. అప్పటొకే భూషయ్య గారు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం లో అన్ని మెళుకువలు తెలుసుకుని చేసే పనిని ఇంకా బాగా ఎలా చెయ్యొచ్చో చెసి చూపించేవారు. తరువాత నందమూరి తారక రామారవు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన పామాయిల్ సాగును విపరీతంగా ప్రోత్సహించేవారు. అప్పుడు తాడువాయిలో మొట్టమొదటిగా ఆయిల్ పామ్ మొదలుపెట్టింది భూషయ్య గారే. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చుట్టుప్రక్కల రైతులను పామాయిల్ పంట వేసుకొండి భవిష్యత్ చాలా బాగుంటుందని ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. భూషయ్యగారు 3 సంవత్సరాలు తోట పెంచి ఆధాయం తీసుకోవడం మొదలు పెట్టిన తరువాత గాని మిగతావారికి అర్ధమవలేదు పామాయిల్ సాగు ఎంత తక్కువ పెట్టుబడి తో ఎంత ఎక్కువ లాభాలు ఆర్జించచ్చో.  క్రమేపి పామాయిల్ కి కూడా ధర పడిపోవడం తో ఆలశ్యం చేయకుండా భూషయ్య గారి పొలం లో కొంత పామాయిల్ తొలగించి వెదురు సాగు మొదలు పెట్టడం జరిగింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయో లేదో వెదురు ద్వారా కూడా ఆధాయం రావడం మొదలయ్యింది. ఈ మధ్య విజయవాడ MP కేసినేని నాని గారు ఈ వెదురు మీద పెద్ద రీసెర్చే చేసి ఈ వెదురనేది పెద్ద ఇండస్ట్రీగా మారుతుందని దీని ద్వారా 1000 కి పైగా వస్తువులు తయారు చెయ్యొచ్చని విస్తృతంగా కృష్ణా జిల్లాలోని రైతులందరికీ అవగాహన కల్పిస్తూ వెదురు వ్యవసాయం వైపు రైతులను ప్రొత్సహించడం ద్వారా విశేష కృషి చేస్తున్నారు. ఈ పంట ఒకసారి వేసుకుంటే 3 సంవత్సరాలు పెరిగే వరకూ ఎదురుచూసి అక్కడ నుండి ప్రతి యేట ఆధాయం పొందవచ్చు. ఇది విపరీతమైన డిమాండ్ ఉన్న పంట కాబట్టి అమ్మకం లో పెద్దగా అవస్థకూడా ఉండదు.  ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కష్టమైన వ్యవసాయం అసలు లాభం వస్తుందో రాదో తెలియని వ్యవసాయం మానివేసి ఇలాంటి కమర్షియల్ పంటల వైపు ప్రతి రైతు దృష్టి సారించడం ఉత్తమం.

పైనున్న వీడియో లో భూషయ్యగారి తోటలో కేవలం 3 సంవత్సరాలలో పెరిగిన వెదురు తోట చూడొచ్చు. నచ్చితే షేర్ చెయ్యండి.

పైనున్న లింకును క్లిక్ చెయ్యడం ద్వారా వెదురు యొక్క భవిష్యత్ ను తెలుసుకొండి.

Photos of Bamboo Plantation in Taduvai, AP

bamboo-crop-india bamboo-cultivation-india bamboo-garden-india bamboo-plantation-cultivation-india bamboo-plantation-india bamboo-sticks-india large-bamboo-sticks-india long-bamboo-sticks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *